BREAKING
thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Test 4
Date of Publish : 04 November 2026, 05:43 pm
Posted by : KOLA MAHESH

ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం

తెలంగాణ
/ రంగారెడ్డి / చేవెళ్ల
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 05:43 PM
10 వీక్షణలు

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఆరుట్ల, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో రూ.50 లక్షల హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టనున్న డబుల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయి.

గ్రామంలోని ఈదమ్మ గుడి నుంచి కంఠమహేశ్వర దేవాలయం వరకు నిర్మించనున్న ఈ రోడ్డు పనులను మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి

ఈ సందర్భంగా వెదిరె హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో సర్పంచులు ఏ పార్టీకి చెందిన వారైనా అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు.

గ్రామాభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్

సర్పంచ్ మానిపాటి శోభాకుమార్ మాట్లాడుతూ.. ఆరుట్ల గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి చిలుకల వెంకటేష్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.