కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ
ఎల్కతుర్తి, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, ఎల్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
.
మద్దతు ధర పొందేలా ధాన్యం విక్రయించాలి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, డైరెక్టర్లు, గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి, వార్డు సభ్యుడు ఎర్రోళ్ల చైతన్య కుమార్, కాంగ్రెస్ నాయకులు పెద్ద గొల్ల రాజు యాదవ్, పల్లె రాకేష్ గౌడ్, వార్డు సభ్యుడు మాట్ల చిరంజీవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుమన్ గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు