రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్
సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన రాచకొండ అంజయ్య–యాదమ్మ దంపతుల కుమార్తె శ్రీ వాణి, రవితేజల నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు.
స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కారోబార్ పున్నం యాదగిరి, గోల్కొండ అంజయ్య, రాచకొండ మల్లేష్, రాచకొండ రమేష్, శ్రీకాంత్, శివ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.