BREAKING
thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Test 4
Date of Publish : 04 November 2026, 06:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

తెలంగాణ
/ ఆదిలాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 06:21 PM
18 వీక్షణలు

ఆత్మహత్య కేసులో ఇరికిస్తానని బెదిరింపులు..

లంచం డిమాండ్ చేసిన పోలీస్ అధికారి పెట్రోల్ బంక్ వద్ద సెంటరింగ్ బాక్సుల కింద నగదు పెట్టించి పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆదిలాబాద్ జిల్లా: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో పోలీస్ అధికారి చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్‌నూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి. రమేష్ రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక అవివాహిత మహిళ ఆత్మహత్యకు సంబంధించి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 194 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిని నిందితుడిగా ఇరికించకుండా ఉండటంతో పాటు, తన వద్ద ఉంచుకున్న ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మరణించిన మహిళ ఆత్మహత్యకు ముందు ఫిర్యాదుదారుడికే చివరిసారిగా ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకున్న ఎస్ఐ, కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ తొలుత రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు చివరకు రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. ట్రాప్‌లో భాగంగా గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపానికి ఫిర్యాదుదారుడిని పిలిపించిన ఎస్ఐ, అక్కడ ఉన్న సెంటరింగ్ బాక్సుల కింద నగదు పెట్టాలని సూచించారు. ఎస్ఐ చెప్పిన విధంగా ఫిర్యాదుదారుడు రూ.40 వేల నగదును అక్కడ ఉంచగా, ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎస్ఐ రమేష్‌ను పట్టుకున్నట్లు సమాచారం. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లంచం డిమాండ్ చేసి, అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.