ద్వారకా తిరుమలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు
రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం స్వామివారికి ప్రార్థనలు ఏలూరు, నవంబర్ 04: ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బుధవారం ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఎంపీకి శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం అందించడంతో పాటు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలతో పాటు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.