BREAKING
thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Test 4
Date of Publish : 04 November 2026, 05:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేపే ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 05:23 PM
16 వీక్షణలు

పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ వర్షాల ప్రభావం తగ్గడంతో షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే నవంబర్ 5వ తేదీ గురువారం పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మురుసు తుపాను ప్రభావం, భారీ వర్షాలు, వరద పరిస్థితులు, ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన వాతావరణంపై జిల్లాల వారీగా సమీక్షించింది. చాలా జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఉండబోవని మెజారిటీ జిల్లా అధికారులు నివేదికలు సమర్పించినట్లు సమాచారం. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎస్‌ఈసీ పోలింగ్ నిర్వహణపై స్పష్టతనిచ్చింది. దీంతో గత కొద్ది రోజులుగా ఎన్నికలు వాయిదా పడతాయా లేదా అన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది. ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది, పోలీసు బందోబస్తు, పోలింగ్ కేంద్రాల నిర్వహణపై యంత్రాంగం దృష్టి సారించింది. అయితే వర్షాలు, వరదల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.