తలసాని నివాసానికి తేజస్వి యాదవ్.. రాజకీయ అంశాలపై నేతల చర్చ
జూబ్లీహిల్స్‌లో మర్యాదపూర్వక భేటీ.. అతిథులను సన్మానించిన తలసాని కుటుంబ సభ్యులు
హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ హైదరాబాద్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసాన్ని సందర్శించారు. జూబ్లీహిల్స్‌లోని తలసాని నివాసంలో తేజస్వి యాదవ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చ
ఈ సందర్భంగా నేతల మధ్య రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, సమకాలీన అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అతిథులకు ఘన సత్కారం
తమ నివాసానికి వచ్చిన తేజస్వి యాదవ్‌తో పాటు ఇతర నాయకులను తలసాని కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
సదర్ సమ్మేళనంలో పాల్గొన్న నేతలు
అంతకుముందు తేజస్వి యాదవ్‌తో పాటు ఇతర నాయకులు సదర్ సమ్మేళనంలో పాల్గొన్నారు. తేజస్వి యాదవ్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో యాదవ సామాజికవర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.