BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 September 2026, 11:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హనంకొండ ట్రై సిటీస్ హాఫ్ మారథాన్‌–2026 పోస్టర్ ఆవిష్కరణ..

క్రీడలు క్రీడలు
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Sep, 2026 - 11:04 PM
1 వీక్షణలు

ట్రై సిటీస్ హాఫ్ మారథాన్‌–2026 పోస్టర్ ఆవిష్కరణ

అక్టోబర్‌ 17న హనుమకొండలో మారథాన్‌.. 21కిమీ, 10కిమీ, 5కిమీ పరుగులు

హనుమకొండ | Ntoday News

ట్రై సిటీస్ హాఫ్ మారథాన్‌–2026, ఎడిషన్‌–2కు సంబంధించిన పోస్టర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ట్రై సిటీస్ హాఫ్ మారథాన్‌–2026ను అక్టోబర్‌ 17, 2026న హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మారథాన్‌లో భాగంగా 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌, 10 కిలోమీటర్ల టైమ్డ్ రన్‌, 5 కిలోమీటర్ల ఫన్ రన్‌ నిర్వహించనున్నారు. యువత, క్రీడాకారులు, ఆరోగ్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు.

యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో యువ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మారథాన్‌ రన్నర్స్‌, క్రెడాయ్‌ వరంగల్‌ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.