BREAKING
thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● India: బంగాళాఖాతంలో మరో తుపాను.. ‘మురసు’గా నామకరణం thumb ● Kurnool: 105 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం thumb ● Nalgonda: పట్టభద్రుల ఓటరు నమోదుకు ఆరు రోజులే గడువు thumb ● Ambedkar Konaseema: 17 గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు ఎన్నికల ప్రచారం thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● India: బంగాళాఖాతంలో మరో తుపాను.. ‘మురసు’గా నామకరణం thumb ● Kurnool: 105 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం thumb ● Nalgonda: పట్టభద్రుల ఓటరు నమోదుకు ఆరు రోజులే గడువు thumb ● Ambedkar Konaseema: 17 గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు ఎన్నికల ప్రచారం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 08:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీటీడీ చైర్మన్ రేసులో ఎన్నారై.. చంద్రబాబు అవకాశం ఇస్తారా

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Nov, 2026 - 08:33 AM
26 వీక్షణలు

 బీఆర్ నాయుడు పదవీకాలం నవంబర్ 7తో ముగింపు కళా వెంకటరావు, జ్యోతుల నెహ్రూ పేర్లపైనా చర్చ

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ నియామకంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు పదవీకాలం నవంబర్ 7తో ముగియనుండటంతో తదుపరి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త చైర్మన్ ఎంపికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెరపైకి ఎన్నారై పేరు టీటీడీ చైర్మన్ పదవికి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఎన్నారై శ్రీనివాస రామానుజం పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన అసలు పేరు లోకాద్రి నాయుడు అని ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో, దేశీయంగా వ్యాపార రంగంలో అనుభవం సంపాదించిన ఆయనకు జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బీజేపీ అగ్రనాయకత్వంతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్నజీయర్ స్వామి సమక్షంలో రామానుజ సంప్రదాయాన్ని స్వీకరించిన అనంతరం శ్రీనివాస రామానుజంగా పేరు మార్చుకున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, వ్యాపార అనుభవం, జాతీయ స్థాయి పరిచయాలు టీటీడీ చైర్మన్ పదవికి అనుకూలంగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన పేరుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనకు అవకాశం కల్పిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ సీనియర్ల పేర్లూ పరిశీలనలో మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకుల పేర్లు కూడా టీటీడీ చైర్మన్ పదవికి సంబంధించి చర్చల్లో వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుతో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీకి చేసిన సేవలు, రాజకీయ అనుభవం, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి సమీకరణాలే కీలకం కూటమి ఏర్పాటు సమయంలోనూ లోకాద్రి నాయుడు తెరవెనుక కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే టీటీడీ చైర్మన్ ఎంపికలో ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు రాజకీయ సమీకరణాలు, పార్టీ విధేయత, పాలనా అనుభవం వంటి అంశాలు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నారై అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారా, లేక పార్టీకి చెందిన సీనియర్ నాయకుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త బోర్డుపై అధికారిక ప్రకటన ఎప్పుడో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల నియమావళి కొత్త టీటీడీ బోర్డు ప్రకటనపై ప్రభావం చూపుతుందా అనే చర్చ కూడా సాగుతోంది. కొత్త బోర్డు నియామకంలో జాప్యం జరిగితే తాత్కాలికంగా స్పెసిఫైడ్ అథారిటీని నియమించే అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు పదవీకాలాన్ని పొడిగిస్తారా అనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. టీటీడీ చైర్మన్ పదవి ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగానూ అత్యంత ప్రాధాన్యం కలిగినది కావడంతో తదుపరి నియామకంపై అందరి దృష్టి నెలకొంది. అయితే శ్రీనివాస రామానుజం, కళా వెంకటరావు, జ్యోతుల నెహ్రూ పేర్లపై జరుగుతున్న చర్చలకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం, ప్రభుత్వం నుంచి వెలువడే అధికారిక ప్రకటనతోనే కొత్త చైర్మన్ ఎవరనే అంశంపై స్పష్టత రానుంది.