BREAKING
thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● యువతకు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● యువతకు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 07:03 pm
Posted by : K MAHESH

అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 07:03 PM
23 వీక్షణలు

అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్ స్నేహ శబరిష్

గంగారం, నవంబర్ 26:

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలకు చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. గురువారం గంగారం మండలంలోని కొడిశాలమిట్ట, పందెం ఏజెన్సీ గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

పనుల్లో నాణ్యత, వేగం పెంచాలి

గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, వి.బి.జి. రామ్ జీ పథకం పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. చేపట్టిన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పని ప్రదేశాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, కూలీలకు వేతనాల చెల్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అంగన్వాడీ కేంద్రం తనిఖీ.. మహిళా సంఘాల కార్యకలాపాలపై సమీక్ష

గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ప్రాథమిక విద్య, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల (SHG) కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.

మహిళా సంఘాల ప్రతినిధి శోభారాణి, ఇతర సభ్యుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన కలెక్టర్.. ప్రభుత్వం అందించిన కోళ్ల పెంపకం ద్వారా వస్తున్న ఆదాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ, రుణ సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రత్యామ్నాయ సాగుతో అధిక ఆదాయం

గంగారం మండల రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఆరుతడి పంటలు, కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.

రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా లెమన్ గ్రాస్ సాగు, పట్టు పరిశ్రమ (సెరీకల్చర్) వైపు వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఇందుకు అవసరమైన మార్కెటింగ్, శిక్షణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

వ్యవసాయ ఖర్చులను తగ్గించుకునేందుకు సౌర విద్యుత్ ఉత్పత్తి, సౌర పరికరాల వినియోగంపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో డీఆర్డీవో మధుసూదన రాజు, ఎంపీడీవో వైష్ణవి, తహసీల్దార్ బాలకిషన్, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.