BREAKING
thumb ● సూరబీర్యాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం thumb ● తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం thumb ● చేనేత కూలీల కూలి పెంచాలని కార్మిక సంఘం వినతి thumb ● బీసీ ఆజాదీ స్టూడెంట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చిన్నూరి జయంత్ thumb ● పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ thumb ● ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదానం చేసిన నర్సింహులపేట యువకులు thumb ● సూరబీర్యాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం thumb ● తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం thumb ● చేనేత కూలీల కూలి పెంచాలని కార్మిక సంఘం వినతి thumb ● బీసీ ఆజాదీ స్టూడెంట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చిన్నూరి జయంత్ thumb ● పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ thumb ● ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదానం చేసిన నర్సింహులపేట యువకులు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 05:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సమాచారం ఇవ్వకుండానే బంగారం వేలం వేశారని ఆరోపణ..

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
29 Oct, 2026 - 05:59 PM
9 వీక్షణలు

 గోల్డ్ లోన్ బ్యాంకుకు తాళం వేసిన వ్యక్తి

12 తులాల బంగారం తనఖా పెట్టి రుణం తీసుకున్న ప్రవీణ్‌

ఇటీవలే రూ.30 వేలు చెల్లించానని బాధితుడి వెల్లడి

నర్సంపేట, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్):

తనఖా పెట్టిన బంగారాన్ని ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వేలం వేశారని ఆరోపిస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి నర్సంపేటలోని ఓ ప్రైవేటు గోల్డ్ లోన్ బ్యాంకుకు తాళం వేశాడు. 12 తులాల బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నానని, రుణం యాక్టివ్‌లో ఉండగానే బంగారాన్ని వేలం వేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేటలోని ఓ ప్రైవేటు గోల్డ్ లోన్ బ్యాంకులో 12 తులాల బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. రుణం యాక్టివ్‌లో ఉండటంతో ఇటీవలే రూ.30 వేలు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే, తాజాగా బ్యాంకుకు వెళ్లి తన బంగారం గురించి ఆరా తీయగా, బంగారం వేలంలో విక్రయించినట్లు సిబ్బంది తెలిపారని ఆరోపించారు.

తనకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా బంగారాన్ని వేలం వేయడంపై ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు వద్ద నిరసనగా తాళం వేసినట్లు తెలిసింది.

ఈ వ్యవహారంపై బ్యాంకు మేనేజర్ అనిల్‌ను ప్రవీణ్ ప్రశ్నించగా, వేలానికి సంబంధించిన సమాచారం ఆయనకు అందజేశామని మేనేజర్ తెలిపినట్లు సమాచారం. అయితే, తనకు సరైన సమాచారం అందలేదని ప్రవీణ్ చెబుతున్నారు.

తనఖా పెట్టిన బంగారం వేలం ప్రక్రియకు సంబంధించి బ్యాంకు నుంచి ఎప్పుడు, ఏ విధంగా సమాచారం ఇచ్చారు? రుణ ఖాతా పరిస్థితి ఏమిటి? వేలం నిబంధనల ప్రకారం ప్రక్రియ చేపట్టారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఘటనపై బ్యాంకు అధికారుల వివరణ, రుణ ఖాతా వివరాలు, వేలం ప్రక్రియకు సంబంధించిన రికార్డులు పరిశీలించిన తర్వాతే పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.