BREAKING
thumb ● సూరబీర్యాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం thumb ● తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం thumb ● చేనేత కూలీల కూలి పెంచాలని కార్మిక సంఘం వినతి thumb ● బీసీ ఆజాదీ స్టూడెంట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చిన్నూరి జయంత్ thumb ● పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ thumb ● ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదానం చేసిన నర్సింహులపేట యువకులు thumb ● సూరబీర్యాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం thumb ● తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం thumb ● చేనేత కూలీల కూలి పెంచాలని కార్మిక సంఘం వినతి thumb ● బీసీ ఆజాదీ స్టూడెంట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చిన్నూరి జయంత్ thumb ● పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ thumb ● ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదానం చేసిన నర్సింహులపేట యువకులు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 06:07 pm
Posted by : P GAJENDRA BABU

తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency
29 Oct, 2026 - 06:07 PM
12 వీక్షణలు

జెడ్పీటీసీ అభ్యర్థి ఇళయరాజా, ఎంపీటీసీ అభ్యర్థి షణ్ముగంను గెలిపించాలని విజ్ఞప్తి

నాగలాపురం, తిరుపతి జిల్లా (ఎన్ టుడే న్యూస్):

తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు ఆధ్వర్యంలో నాగలాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. నాగలాపురం మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఇళయరాజా, నాగలాపురం సెగ్మెంట్‌–2 ఎంపీటీసీ అభ్యర్థి షణ్ముగం గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలిసి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి, అత్యధిక ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి విజయానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నాగలాపురం మండలంలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో అభ్యర్థులు విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా, జిల్లా కార్యదర్శి మణి దేవదానం, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ జ్యోతేశ్వర్ నాయక్, జిల్లా కలెక్టరేట్ రిప్రజెంటేటివ్ చైర్మన్ చిరంజీవి, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రేమసుందరం పాల్గొన్నారు.

అలాగే శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, నాగలాపురం మండల అధ్యక్షుడు తిరుమలై, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు సునీల్ రెడ్డితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.