BREAKING
thumb ● సూరబీర్యాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం thumb ● తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం thumb ● చేనేత కూలీల కూలి పెంచాలని కార్మిక సంఘం వినతి thumb ● బీసీ ఆజాదీ స్టూడెంట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చిన్నూరి జయంత్ thumb ● పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ thumb ● ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదానం చేసిన నర్సింహులపేట యువకులు thumb ● సూరబీర్యాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం thumb ● తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం thumb ● చేనేత కూలీల కూలి పెంచాలని కార్మిక సంఘం వినతి thumb ● బీసీ ఆజాదీ స్టూడెంట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చిన్నూరి జయంత్ thumb ● పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ thumb ● ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదానం చేసిన నర్సింహులపేట యువకులు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 06:05 pm
Posted by : VALLAPU KOTESH

అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
29 Oct, 2026 - 06:05 PM
49 వీక్షణలు

2005–2006 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌ మానవీయత.. లక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

మహమ్మదాపురం, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్):

స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు 2005–2006 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహమ్మదాపురం గ్రామానికి చెందిన రాసిక లక్ష్మి (తండ్రి: రాసిక సాయన్న)ను గురువారం ఆమె స్నేహితులు పరామర్శించారు. ఆమె వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలకు అండగా నిలిచేందుకు రూ.96,500 ఆర్థిక సహాయం అందజేశారు.

తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న 2005–2006 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌ సభ్యులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందజేసి, ఆమె కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.

కష్టసమయాల్లో స్నేహితులు ఒకరికొకరు తోడుగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని వారు తెలిపారు. తమ బ్యాచ్‌కు చెందిన ఎవరికైనా ఆపద ఎదురైతే అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో తామున్నామనే నమ్మకాన్ని కల్పించారు.

తన అనారోగ్య పరిస్థితుల్లో స్నేహితులు పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం పట్ల రాసిక లక్ష్మి సంతోషం వ్యక్తం చేసింది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. లక్ష్మి కుటుంబ సభ్యులు సైతం సహాయం అందించిన స్నేహితులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఆపదలో ఉన్న స్నేహితురాలికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం పలువురిని ఆకట్టుకుంది. పూర్వ విద్యార్థుల మధ్య ఉన్న ఆత్మీయత, ఐక్యతకు ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.