BREAKING
thumb ● మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం thumb ● గోవింద్‌పేట్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం thumb ● గోవింద్‌పేట్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ...
మంచి మాట
Date of Publish : 29 October 2026, 04:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూటమికి రెబల్స్ సెగ స్థానిక సంగ్రామంలో తిరుగుబాటు అభ్యర్థుల హవా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Oct, 2026 - 04:39 PM
26 వీక్షణలు

బరిలో నుంచి తప్పుకోవాలన్న అగ్రనేతల సూచనలు బేఖాతర్ ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అంటూ గెలుపు ధీమాతో పోటీ రాష్ట్రవ్యాప్తంగా 26 జడ్పీటీసీ, 171 ఎంపీటీసీ స్థానాల్లో రెబల్స్ రాయలసీమలో అధికం.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోనూ తీవ్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి పార్టీలకు రెబల్స్ సెగ తగులుతోంది. పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండాలని, అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేయవద్దని అగ్రనేతలు పదేపదే సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచి అధికారిక అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు. దీంతో కూటమి పార్టీలకు సొంత పార్టీ నేతల నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది.

బుజ్జగింపులకు లొంగని ఆశావహులు

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న అంచనాలతో పలువురు నేతలు పోటీకి ఆసక్తి చూపారు. తమకే పార్టీ బీఫామ్ దక్కుతుందన్న ఆశతో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించడంతో టికెట్లు ఆశించిన నాయకులకు నిరాశ ఎదురైంది. దీంతో ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అన్న ధోరణితో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా, మరికొందరు పార్టీ అభ్యర్థులకు ప్రత్యర్థులుగా రంగంలోకి దిగారు. అగ్రనేతల హెచ్చరికలు, స్థానిక నాయకుల బుజ్జగింపులు కొందరిపై ప్రభావం చూపినా, మరికొందరు మాత్రం పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. తమకున్న స్థానిక బలం, అనుచరగణం, వ్యక్తిగత పరిచయాలే విజయానికి దోహదపడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి

రాష్ట్రవ్యాప్తంగా 26 జడ్పీటీసీ స్థానాలు, 171 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు సమాచారం. వీరిలో అత్యధికంగా రాయలసీమ జిల్లాల్లోనే రెబల్స్ ప్రభావం కనిపిస్తోంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల మిత్రపక్షాల మధ్య పోటీ నెలకొనగా, మరికొన్ని ప్రాంతాల్లో ఒకే పార్టీకి చెందిన నేతలు పరస్పరం తలపడుతున్నారు. దీంతో అధికారిక అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది.

రాయలసీమలో రెబల్స్ ప్రభావం అధికం

రాయలసీమ జిల్లాల్లో 12 జడ్పీటీసీ, 64 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవర మనోహర్‌తో పాటు అదే పార్టీకి చెందిన గుండాల వెంకటరమణ పోటీకి దిగారు. కర్నూలు జిల్లా కౌతాళం జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థికి పోటీగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ బరిలో ఉన్నారు. పోలకల్లు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కురవ ధరన్నకు వ్యతిరేకంగా అదే పార్టీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, సిరివెళ్ల, పాములపాడు, గోస్పాడు, గడివేముల జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 41 ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి పార్టీల నుంచి రెబల్స్ బరిలో నిలిచారు. వీరిలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే 31 ఎంపీటీసీ స్థానాలకు తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు సమాచారం. శ్రీసత్యసాయి జిల్లాలో నంబులపూలకుంట జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, అక్కడ టీడీపీ రెబల్ పోటీలో ఉన్నారు. మరో 18 ఎంపీటీసీ స్థానాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థులు తలపడుతున్నారు. అనంతపురం జిల్లాలో బొమ్మనహాళ్ జడ్పీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థికి బీఫామ్ ఇవ్వగా, టీడీపీ రెబల్ పోటీలో ఉన్నారు. నార్పల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అధికారిక అభ్యర్థితో పాటు టీడీపీ, జనసేనకు చెందిన తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. మరో ఐదు ఎంపీటీసీ స్థానాల్లోనూ రెబల్స్ పోటీ చేస్తున్నారు. కడప జిల్లాలో కలసపాడు జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, అక్కడ టీడీపీ నేత తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగారు.

ఉత్తరాంధ్రలోనూ తప్పని తలనొప్పి

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరు జడ్పీటీసీ, 31 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అధికారిక అభ్యర్థికి అదే పార్టీకి చెందిన రెబల్ పోటీ ఇస్తున్నారు. మూడు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కోనాడ ఎంపీటీసీ స్థానానికి పలువురు నామినేషన్లు దాఖలు చేయడంతో చివరకు ఎవరికీ బీఫామ్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పొత్తు సమస్యలు కనిపిస్తున్నాయి. బలిజిపేట జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, టీడీపీ రెబల్ బరిలో ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం జడ్పీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థికి పోటీగా టీడీపీ సీనియర్ నాయకుడు పాడి సుదర్శనరావు నిలిచారు. పాలకొండ నియోజకవర్గంలోని వీరఘట్టం జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీకి కేటాయించినప్పటికీ జనసేన, బీజేపీ నేతలు కూడా పోటీకి దిగారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల, బుచ్చయ్యపేట జడ్పీటీసీ స్థానాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

గోదావరి జిల్లాల్లోనూ గందరగోళం

గోదావరి జిల్లాల్లో ఐదు జడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు సమాచారం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, జనసేన నేత, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తనయుడు వీర వెంకట సత్యసూరిబాబు పోటీలో ఉన్నారు. కరప జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీకి కేటాయించగా, అదే పార్టీకి చెందిన మరో నేత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ జిల్లాలోని 77 ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులకు రెబల్స్ నుంచి పోటీ ఎదురవుతోంది. కోనసీమ జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం మండవల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కొట్రగడ్డ శంకరరావుతో పాటు జనసేనకు చెందిన మంటుసాల శ్రీనివాసరావు, ఆయన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగినట్లు సమాచారం. దీంతో ఈ స్థానం ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పోటీ

కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో రెబల్స్ ప్రభావం ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానంలో తిరుగుబాటు అభ్యర్థి బరిలో ఉన్నారు. కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గం మొవ్వ జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థి తాడిశెట్టి నరేశ్‌కు పోటీగా టీడీపీ నేత నన్నపనేని నరేంద్ర నిలిచారు. పల్నాడు జిల్లాలో మూడు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటీపడుతున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, టీడీపీ నేత పోటీలో ఉన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు బీఫామ్‌లతో పోటీ పడుతున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో జనసేనకు చెందినవారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అగ్రనేతల హెచ్చరికలు పనిచేసేనా

కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేందుకు నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. అధికారిక అభ్యర్థుల విజయానికి సహకరించాలని, పొత్తు ధర్మాన్ని పాటించాలని అగ్రనేతలు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి సైతం సుమారు 45 వేల మంది టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో రెబల్స్ పోటీలో ఉండటం కూటమి ధర్మానికి విరుద్ధమని స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ స్థానికంగా తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న పలువురు నాయకులు వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిణామాలు అధికారిక అభ్యర్థుల ఓట్లను చీల్చే అవకాశముండటంతో కూటమి నాయకత్వం అప్రమత్తమైంది. చివరి వరకు బుజ్జగింపులు కొనసాగించినా రెబల్స్ తమ నిర్ణయానికే కట్టుబడితే ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.