చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం
గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి వై. మణిని గెలిపించాలి: కూటమి నాయకుల విజ్ఞప్తి
శ్రీకాళహస్తి, అక్టోబర్ 28: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి వై. మణిని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కూటమి నాయకులు ఓటర్లను కోరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చిట్టతూరు పంచాయతీలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి ఎంపీటీసీ అభ్యర్థి వై. మణికి గాజు గ్లాస్ గుర్తుపై, టీడీపీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని తెలిపారు. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రజల మద్దతు కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలను కలుసుకుని తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరగా, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కూటమి నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.