BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 08:22 pm
Posted by : KOLA MAHESH

రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
28 Oct, 2026 - 08:22 PM
15 వీక్షణలు

అక్టోబర్ 31న ఐలు యాదాద్రి భువనగిరి జిల్లా రెండో మహాసభలు

ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్

రామన్నపేట, అక్టోబర్ 28: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) యాదాద్రి భువనగిరి జిల్లా రెండో మహాసభలను అక్టోబర్ 31వ తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు భువనగిరిలోని న్యూ వివేరా హోటల్‌లో నిర్వహించనున్నట్లు ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం రామన్నపేటలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మహాసభల సందర్భంగా ‘రాజ్యాంగ పరిరక్షణ – న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ హాజరై ప్రసంగించనున్నట్లు వెల్లడించారు.

భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని మామిడి వెంకట్ రెడ్డి అన్నారు. న్యాయవాదుల వృత్తిపరమైన సమస్యలు, జూనియర్ న్యాయవాదులకు ఉపకార వేతనం, వైద్య బీమా, వెల్ఫేర్ ఫండ్ బకాయిల విడుదల, కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

గతంలో ఐలు జిల్లా కమిటీ నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు న్యాయవాదుల హక్కులు, సంక్షేమం కోసం చేపట్టాల్సిన ఉద్యమాలపై తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే నూతన జిల్లా కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు.

జిల్లాలోని సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులందరూ మహాసభలకు, రాజ్యాంగ పరిరక్షణ సెమినార్‌కు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మామిడి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, యాదాసు యాదయ్య, శ్రీకాంత్, గడ్డం నరసింహ, పరమేష్, సురేష్, అంతటి స్వామి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోర్టు నూతన కమిటీని ఎన్నుకున్నారు.