నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం
- వైద్య సేవలను అభినందించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
- శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వైద్య పరీక్షలు
నారాయణపురం, అక్టోబర్ 28: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరాన్ని నిర్వహించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
సెప్టెంబర్ 27, 2026న నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో శస్త్రచికిత్సలకు ఎంపికై ఆపరేషన్లు చేయించుకున్న వారికి రివ్యూ పరీక్షలు నిర్వహించారు. అలాగే గతంలో శస్త్రచికిత్స అవసరమైనప్పటికీ షుగర్, బీపీ సమస్యల కారణంగా ఆపరేషన్లు చేయించుకోలేకపోయిన వారికి కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పాల్గొన్నారు. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఏపూరి సతీష్, గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి యాదవ్, వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేష్ నేత, సభావత రఘునాయక్, చింతల శైలజ సత్యనారాయణ, నీళ్ల అనిత శంకర్, పట్నం బాలకృష్ణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు గుత్తా వెంకట్ రెడ్డి, గునిగంటి రాజు గౌడ్, మారగోని శంకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, శిఖలమెట్ల సాయి, బానోతు కిరణ్ నాయక్, వడ్డేపల్లి శివప్రసాద్, బానోతు గణేష్ నాయక్‌తో పాటు వైద్యులు, పత్రికా విలేకరులు, మండల ప్రజలు పాల్గొన్నారు.