గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన చరణ్!...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా: పుంగనూరు.
పుంగనూరు మండలం కొత్త ఇండ్ల మున్సిపల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న చరణ్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. కానిస్టేబుల్ వెంకటేష్ కుమారుడైన చరణ్ తన ప్రతిభతో పతకాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న వయసులోనే ప్రతిభను చాటుకుని పతకాలు సాధించిన చరణ్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.