పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి:
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, అక్టోబర్ 28: పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మండలంలోని పట్టభద్రులను కలిసి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు, యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.
పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగానే నమోదు చేసుకోవాలని, పార్టీ నాయకులు ఈ ప్రక్రియను బాధ్యతగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బందెల రాములు, పోషబోయిన మల్లేశం, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, సర్పంచ్ గొలుసుల సత్తయ్య, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, ఎండీ ఆమీర్, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, ముక్కామల దుర్గయ్య, ఎస్.కె. చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.