BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 08:19 pm
Posted by : KOLA MAHESH

దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
28 Oct, 2026 - 08:19 PM
13 వీక్షణలు

రూ.2.27 లక్షల విలువైన నోట్‌బుక్స్ అందజేత

రామన్నపేట, అక్టోబర్ 28: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యున్నతికి దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వెల్లంకి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ సూచించారు.

బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని వెల్లంకి ప్రభుత్వ పాఠశాలలో దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కంపెనీ సమకూర్చిన రూ.2,27,766 విలువైన నోట్‌బుక్స్‌ను సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.

అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దివీస్ లేబొరేటరీస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ నరేష్, సరోజ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేపట్టి, అవసరమైన మందులు, టానిక్‌లను సర్పంచ్ అందజేశారు.

విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం పట్ల పాఠశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు ఎస్. లింగన్న, ప్రధానోపాధ్యాయులు బి. సురేందర్ రెడ్డి, వి. మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, దివీస్ కంపెనీ ప్రతినిధులు బి. గోపి, బి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.