అర్నాబ్ తుఫాన్ ప్రభావం.. తూర్పుగోదావరి జిల్లాలో గురువారం పాఠశాలలకు సెలవు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
తూర్పుగోదావరి జిల్లా | ఎన్ టుడే న్యూస్: అర్నాబ్ తుఫాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై అధికంగా ఉండే అవకాశముందన్న వాతావరణ సూచనల నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు అక్టోబర్ 29, గురువారం నాడు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు.
తుఫాన్ ప్రభావం కారణంగా పాఠశాలల్లోని రికార్డులు, విద్యా సామగ్రి భద్రతకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.
అయితే, అక్టోబర్ 29న ప్రకటించిన సెలవుకు బదులుగా మరో ప్రభుత్వ సెలవు రోజున పనిచేయాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.