BREAKING
thumb ● సూరబీర్యాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం thumb ● తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం thumb ● చేనేత కూలీల కూలి పెంచాలని కార్మిక సంఘం వినతి thumb ● బీసీ ఆజాదీ స్టూడెంట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చిన్నూరి జయంత్ thumb ● పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ thumb ● ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదానం చేసిన నర్సింహులపేట యువకులు thumb ● సూరబీర్యాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం thumb ● తిరుపతి: నాగలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బాలగురవం బాబు ప్రచారం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితురాలికి రూ.96,500 ఆర్థిక సాయం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం thumb ● చేనేత కూలీల కూలి పెంచాలని కార్మిక సంఘం వినతి thumb ● బీసీ ఆజాదీ స్టూడెంట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చిన్నూరి జయంత్ thumb ● పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ thumb ● ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం thumb ● పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదానం చేసిన నర్సింహులపేట యువకులు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 04:46 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బొగత జలపాతంలో మొసలి ఉందంటూ ప్రచారం.. పర్యాటకుల్లో ఆందోళన

తెలంగాణ
/ ములుగు
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
29 Oct, 2026 - 04:46 PM
12 వీక్షణలు

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు, పోస్టులు.. పరిశీలనలో మొసలి ఆచూకీ లభించలేదన్న అటవీశాఖ అధికారులు

వాజేడు, ఎన్ టుడే న్యూస్:

ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతంలో మొసలి కనిపించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో పర్యాటకుల్లో ఆందోళన నెలకొంది. జలపాతం వద్ద మొసలి ఉందనే సమాచారం వైరల్ కావడంతో సందర్శకులు నీటిలోకి దిగేందుకు వెనుకంజ వేస్తున్నారు.

బొగత జలపాతంలో మొసలి కనిపించిందనే సమాచారంపై అటవీశాఖ అధికారులను వివరణ కోరగా, సమాచారం అందిన వెంటనే తమ సిబ్బందితో కలిసి జలపాతం ప్రాంతానికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. అయితే, పరిశీలన సమయంలో మొసలి ఆచూకీ కనిపించలేదని వెల్లడించారు.

మొసలి ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సిబ్బందితో మరింత క్షుణ్ణంగా పరిశీలన జరిపిస్తామని అధికారులు పేర్కొన్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత వాస్తవ పరిస్థితిని తెలియజేస్తామని తెలిపారు.

మొసలి కనిపించిందనే ప్రచారంపై అటవీశాఖ నుంచి స్పష్టమైన నిర్ధారణ వచ్చే వరకు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జలపాతం వద్ద భద్రతా సిబ్బంది సూచనలు పాటిస్తూ, అనుమతి లేని లేదా ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుతం మొసలి ఉనికి నిర్ధారణ కాలేదు. అటవీశాఖ అధికారుల తదుపరి పరిశీలనలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.