BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 07:56 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు

భక్తి భక్తి
15 Oct, 2026 - 07:56 PM
16 వీక్షణలు

ధనలక్ష్మీ, లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు

రొంపిచర్ల: మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజైన గురువారం ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్థానిక బ్యాంక్ సెంటర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తూర్పు బజారులోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో కొలువుదీరారు.

వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన, అలంకరణ పూజలు చేశారు. రాత్రి వేళ భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.