BREAKING
thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 11:55 am
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణ న్యాయాధికారులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
01 Nov, 2026 - 11:55 AM
10 వీక్షణలు

61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ.. మార్చి 31, 2026 నుంచి వర్తింపు

హైదరాబాద్, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ రాష్ట్రంలోని న్యాయాధికారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్, జ్యుడీషియల్ సర్వీస్ అధికారుల పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం–1984కు సవరణలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం

సుప్రీంకోర్టు ఆదేశాలు, తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్టు సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనుభవజ్ఞులైన న్యాయాధికారుల సేవలను మరికొంతకాలం కొనసాగించడం, న్యాయవ్యవస్థలో వారి అనుభవాన్ని వినియోగించుకోవడం ఈ మార్పు ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.

మార్చి 31 నుంచే అమల్లోకి

ఈ సవరణలు 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. అంటే నిర్ణయాన్ని గత తేదీ నుంచి వర్తింపజేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ తేదీన లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన అర్హులైన న్యాయాధికారులకు నిబంధనలు, షరతులకు లోబడి తిరిగి విధుల్లో చేరే అవకాశం కల్పించారు.

సర్వీస్, వేతన ప్రయోజనాలు

తిరిగి విధుల్లో చేరేందుకు అర్హత పొందిన అధికారులకు సర్వీస్ కొనసాగింపు, వేతనం, సీనియారిటీతో పాటు ఇతర అనుబంధ ప్రయోజనాలు కల్పించేలా ఆర్డినెన్స్‌లో నిబంధనలు పొందుపరిచినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో అర్హులైన న్యాయాధికారులకు పదవీ విరమణ వయసు పెంపు ప్రయోజనం లభించనుంది.