BREAKING
thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 11:46 am
Posted by : KOLA MAHESH

Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
01 Nov, 2026 - 11:46 AM
12 వీక్షణలు

70 తులాల బంగారం, నగదు దోపిడీ.. స్కార్పియో జీపీఎస్ ఆధారంగా బోధన్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

చౌటుప్పల్, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయ కాలనీలో జోగిని రాళ్లబండి సుధాకర్ స్వామి గురూజీ (48) హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు అనుమానితులను నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పెప్పర్ స్ప్రే చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి హత్య

అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు తొలుత సుధాకర్ స్వామి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, అనంతరం ఆయన కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇంట్లోని బీరువాను తెరిచి సుమారు 70 తులాల బంగారంతో పాటు నగదును దోచుకెళ్లినట్లు సమాచారం.

స్కార్పియో వాహనంలో పరారీ

హత్య అనంతరం నిందితులు మృతుడికి చెందిన స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించారు.

జీపీఎస్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు అస్సాం రాష్ట్రానికి చెందినవారని, గత కొంతకాలంగా సుధాకర్ స్వామి వద్ద శిష్యులుగా ఉంటూ తిరుగుతున్నారని తెలుస్తోంది. మరోవైపు నిందితులు తీసుకెళ్లిన స్కార్పియో వాహనంలోని జీపీఎస్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాలపై కొనసాగుతున్న విచారణ

అదుపులోకి తీసుకున్న వ్యక్తుల పాత్ర, హత్యకు గల కారణాలు, దోచుకెళ్లిన బంగారం, నగదు వివరాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో చౌటుప్పల్ మార్కండేయ కాలనీలో తీవ్ర కలకలం నెలకొంది.