BREAKING
thumb ● బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం thumb ● ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు thumb ● Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం thumb ● ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు thumb ● Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు
మంచి మాట
Date of Publish : 01 November 2026, 01:21 pm
Posted by : M. రాజశేఖర్

Kuppam: రాప్తాడు పాఠశాలలో విద్యార్థినులపై దాడి ఘటనను ఖండించిన న్యాయవాది నరేంద్ర ఆజాద్

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
01 Nov, 2026 - 01:21 PM
8 వీక్షణలు

బాధిత కుటుంబాలకు భారీ పరిహారం అందించాలి.. ఇద్దరు విద్యార్థినులకు ఉచిత వైద్యం కల్పించాలి

కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి త్వరితగతిన విచారణ జరపాలి

ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలి

అనంతపురం / కుప్పం, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి గదిలో విద్యార్థినులపై రంపంతో జరిగిన దాడి ఘటనను న్యాయవాది, సామాజిక కార్యకర్త ఎ. నరేంద్ర ఆజాద్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు చదువుకునే తరగతి గదిలోకి బాహ్య వ్యక్తి ఆయుధంతో ప్రవేశించి విద్యార్థినులపై దాడికి పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థినులకు తక్షణ న్యాయం చేయడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాలకు భారీ పరిహారం అందించాలి

ఈ దాడి కారణంగా తీవ్ర ఆందోళనకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక పరిహారం ప్రకటించాలని నరేంద్ర ఆజాద్ కోరారు. గాయపడిన ఇద్దరు విద్యార్థినులకు అవసరమైన వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని సూచించారు. అవసరమైతే మెరుగైన అత్యవసర వైద్యం కోసం కార్పొరేట్ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించి ఉచిత వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరపాలి

ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు త్వరగా అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే కేసు విచారణలో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించాలని కోరారు. నిర్ణీత కాలవ్యవధిలో బలమైన చార్జ్‌షీట్ దాఖలు చేసి, చట్ట ప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

పాఠశాలల్లో భద్రతను పటిష్టం చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా ఏర్పాట్లను తక్షణమే సమీక్షించాలని నరేంద్ర ఆజాద్ డిమాండ్ చేశారు. పాఠశాల ప్రాంగణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బయటి వ్యక్తుల ప్రవేశంపై కఠినమైన నిఘా ఉండాలని సూచించారు. పాఠశాల వేళల్లో షీ టీమ్స్ ద్వారా పోలీసు గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా పాఠశాలలకు వెళ్లి చదువుకునే వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పాఠశాల భద్రతా సంస్కరణలు అమలు చేయాలని తన ప్రకటనలో కోరారు.

ఎ. నరేంద్ర ఆజాద్

న్యాయవాది, సామాజిక కార్యకర్త