BREAKING
thumb ● బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం thumb ● ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు thumb ● Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం thumb ● ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు thumb ● Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు
మంచి మాట
Date of Publish : 01 November 2026, 02:10 pm
Posted by : KOLA MAHESH

బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ
/ నల్గొండ / చండూరు
Reporter
Kola Mahesh Munugodu Constituency
01 Nov, 2026 - 02:10 PM
26 వీక్షణలు

చండూరు మండలంలోని 19 గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలపై చర్యలకు ఆదేశం.. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎస్ఐకి హెచ్చరిక

చండూరు, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

నల్గొండ జిల్లా చండూరు మండలంలోని గ్రామాల్లో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని 19 గ్రామాల్లో బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

ఎస్ఐకి ఫోన్ చేసి హెచ్చరిక

ఈ అంశంపై చండూరు ఎస్ఐ శివకుమార్‌కు ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

యువతపై ప్రభావం చూపుతున్న బెల్ట్ షాపులు

గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాల కారణంగా ప్రజలు, ముఖ్యంగా యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.