Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు
రాష్ట్రీయ ఏకతా భారత్ పర్వ్‌లో భాగంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా పర్యటన
గుజరాత్, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
రాష్ట్రీయ ఏకతా భారత్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఇందూర్ జిల్లా వాసులు గుజరాత్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు.
నర్మదా తీరంలో ఐక్యతా విగ్రహం సందర్శన
గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవడియా ప్రాంతంలో నర్మదా నది సమీపంలో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించి విగ్రహాన్ని తిలకించినట్లు ఇందూర్ జిల్లా వాసులు తెలిపారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన కృషి, ఆయన జీవిత విశేషాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జాతీయ ఐక్యత సందేశంతో కార్యక్రమం
దేశంలోని సంస్థానాలను ఏకం చేసి భారతదేశ సమగ్రతకు పటేల్ చేసిన సేవలను స్మరించుకోవడంతో పాటు, జాతీయ ఐక్యత ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఈ పర్యటన తమకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని తెలిపారు.