BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 02:17 pm
Posted by : KOUNDINYASRI NANDURI VENKATESWARA RAJU

Chandanagar: చందానగర్‌లో పటేల్‌, ఇందిరాగాంధీకి ఘన నివాళులు

జాతీయం
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
31 Oct, 2026 - 02:17 PM
19 వీక్షణలు

విద్యార్థులకు విద్యా సామగ్రి, పండ్లు, బిస్కెట్ల పంపిణీ.. జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ

డఫ్‌ అండ్‌ డమ్‌ పాఠశాలలో ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

శేరిలింగంపల్లి, చందానగర్‌, అక్టోబర్‌ 31: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని చందానగర్‌లోని డఫ్‌ అండ్‌ డమ్‌ పాఠశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్‌ ఆధ్వర్యంలో పటేల్‌, ఇందిరాగాంధీ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్పనర్లు, బిస్కెట్లు, పండ్లు, పాప్‌కార్న్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

దేశ సమైక్యతకు పటేల్‌ విశేష కృషి

అనంతరం రామస్వామి యాదవ్‌ మాట్లాడుతూ.. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్వాతంత్ర్య సమరయోధుడిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా దేశానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం 500కు పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఉప ప్రధానిగా, కేంద్ర హోం మంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తుచేశారు. పటేల్‌ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించడం ఆయన సేవలకు గుర్తింపని పేర్కొన్నారు.

దేశ అభివృద్ధిలో ఇందిరాగాంధీ పాత్ర

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను కూడా ఆయన గుర్తుచేశారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాలు, దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. బంగ్లాదేశ్‌ ఆవిర్భావ సమయంలో ఆమె నాయకత్వం కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. దేశ తొలి మహిళా ప్రధానిగా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకురాలిగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచారని తెలిపారు.

పటేల్‌, ఇందిరాగాంధీల జీవితాలను ఆదర్శంగా తీసుకొని యువత ధైర్యంగా సమాజంలోని సమస్యలపై పోరాడాలని రామస్వామి యాదవ్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారితో జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు శివరామకృష్ణ, జనార్ధన్‌, వాణి, సాంబశివరావు, పాలం శ్రీను, పాఠశాల ప్రిన్సిపాల్‌ మెర్సీ, ఉపాధ్యాయురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.