వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం
- అయ్యప్ప స్వాములకు, భక్తులకు
- అన్నప్రసాదం పంపిణీ చేసిన పర్స శ్యామ్‌రావు, పద్మ దంపతులు
తెల్లాపూర్ (ఎన్ టుడే న్యూస్):
డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు, పద్మ దంపతులు తమ కుమార్తె అఖిల, అల్లుడు శివకుమార్ వివాహ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 30న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబంలోని శుభకార్యాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తెల్లాపూర్‌లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో అయ్యప్ప స్వాములకు, ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు అయ్యప్ప స్వాములు, భక్తులు కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
వివాహ వార్షికోత్సవం వంటి కుటుంబ వేడుకను అన్నదానం ద్వారా సేవా కార్యక్రమంగా నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు అన్నప్రసాదం అందించి సేవాభావాన్ని చాటుకున్న పర్స శ్యామ్‌రావు, పద్మ దంపతులను అభినందించారు.