BREAKING
thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి
మంచి మాట
Date of Publish : 30 October 2026, 08:04 pm
Posted by : KOLA MAHESH

ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
30 Oct, 2026 - 08:04 PM
14 వీక్షణలు
జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

ఎల్‌-నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ఏర్పడే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలో గ్రామసభలు నిర్వహించారు. మండలంలోని కక్కిరేణి, ఎన్నారం, కుంకుడుపాముల గ్రామాల్లో నిర్వహించిన ఈ సమావేశాల్లో జల సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

రాబోయే రోజుల్లో గ్రామాల్లో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. వి.బి.జి. రామ్‌ పథకం ద్వారా చేపట్టాల్సిన జల సంరక్షణ పనులు, వాటి ప్రాధాన్యతను గ్రామస్థులకు వివరించారు. నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ గ్రామసభల్లో ఎంపీడీఓ ఆవుల రాములు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్‌లు పాల్గొన్నారు. కక్కిరేణి సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఎన్నారం సర్పంచ్ జనని, కుంకుడుపాముల సర్పంచ్ సత్తయ్యతో పాటు ఆయా గ్రామాల ప్రజలు సమావేశాల్లో పాల్గొన్నారు.