BREAKING
thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి
మంచి మాట
Date of Publish : 30 October 2026, 07:53 pm
Posted by : KOLA MAHESH

తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
30 Oct, 2026 - 07:53 PM
9 వీక్షణలు

తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మణ్

తొర్రూరు, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఖానాపురం గ్రామానికి చెందిన బచ్చలి లక్ష్మణ్ నియమితులయ్యారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆశీస్సులతో, ముత్తినేని సోమేశ్వర్ రావు సహకారంతో తనకు ఈ బాధ్యతలు లభించినట్లు లక్ష్మణ్ తెలిపారు.

నాయకులకు కృతజ్ఞతలు

నియామకం సందర్భంగా బచ్చలి లక్ష్మణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తన నియామకానికి సహకరించిన తొర్రూరు మండల, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

తనపై నాయకులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని లక్ష్మణ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.