పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి
ప్రతి బూత్‌లో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేయించాలి
బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపు
మునుగోడు, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు, బూత్ స్థాయి నాయకులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లకు సూచనలు జారీ చేశారు.
అర్హులైన పట్టభద్రులందరినీ గుర్తించాలి
నియోజకవర్గ పరిధిలో డిగ్రీ పూర్తి చేసి అర్హత గడువు నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేయించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి బూత్‌లో అత్యధిక సంఖ్యలో పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయించేలా పార్టీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
సర్వోత్తమ్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలి
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. మునుగోడు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సాధించేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
నవంబర్ 6 వరకు కొనసాగనున్న ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి బూత్ స్థాయి ఏజెంట్, పార్టీ నాయకుడు చురుగ్గా పాల్గొని అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.