BREAKING
thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి
మంచి మాట
Date of Publish : 30 October 2026, 09:17 pm
Posted by : KOLA MAHESH

నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
30 Oct, 2026 - 09:17 PM
13 వీక్షణలు

రుణాల మంజూరులో జాప్యంపై ఎంపీ బలరాం నాయక్ స్పందన

పంట రుణాల సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ ధరావత్ కైక, మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి

మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కేసముద్రం శాఖలో పంట రుణాలు తక్షణమే మంజూరు చేయాలని ఎంపీ బలరాం నాయక్ సంబంధిత అధికారులను కోరారు. పంట రుణాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై ఆయన స్పందించి జిల్లా కలెక్టర్, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్, మహబూబాబాద్ లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు అధికారికంగా లేఖ రాశారు.

నారాయణపురం రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ పంట రుణాలు మంజూరు కావడం లేదని క్యాంపు తండా సర్పంచ్ ధరావత్ కైక, మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి తెలిపారు. రైతులు పలుమార్లు బ్యాంకు అధికారులను కలిసి రుణాల కోసం విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. నో డ్యూ సర్టిఫికెట్లు సమర్పించినప్పటికీ నెలలు గడుస్తున్నా రుణాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ బలరాం నాయక్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులను బ్యాంకుల చుట్టూ పదేపదే తిప్పించుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు అవసరమైన సమయంలో పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించడం బ్యాంకుల బాధ్యత అని పేర్కొన్నారు.

నారాయణపురం రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పంట రుణాలు మంజూరు చేయాలని, వారి సమస్యలను అర్థం చేసుకుని బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందని, వ్యవసాయం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నారాయణపురం రైతులకు న్యాయం జరిగే వరకు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ బలరాం నాయక్ హామీ ఇచ్చారు.