BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 12:39 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
31 Oct, 2026 - 12:39 PM
9 వీక్షణలు

హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలo ఎన్ టుడే న్యూస్:

ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ నాయకులు.

ఎల్కతుర్తి  బస్టాండ్ సర్కిల్ వద్ద భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ, దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

 ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా ఆమె అందించిన సేవలను, దేశ అభివృద్ధికి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ పోషించిన కీలక పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, సొసైటీ బ్యాంకు అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, గోళి రాజేశ్వర్ రావు సూరారం గ్రామశాఖ అధ్యక్షులు బచ్చు శ్రీదర్ రావు ఆంబాల శ్రీకాంత్,బక్కి ఎఎంసి డైరెక్టర్ గొడిశాల రాజయ్య, మండ సుమన్ గౌడ్, బ్యాంకు డైరెక్టర్ తంగళ్లపెల్లి కొంరయ్య బొల్లెపోగు రమేష్ బాబు, గొడిశాల అర్జున్ గౌడ్, కుర్ర ప్రకాశ్ గౌడ్, వల్లాభపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గౌతమ్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామశాఖల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.