ఉరుమడ్లలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఉరుమడ్ల, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రారంభంతో స్థానిక రైతులకు ధాన్యం విక్రయించేందుకు అవకాశం కలగనుంది. కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు జన్నపాల శ్రీను కోరారు.