BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 02:06 pm
Posted by : SEETHA KIRAN KUMAR

Warangal: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: GWMC కమిషనర్ టి. వెంకన్న

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
31 Oct, 2026 - 02:06 PM
15 వీక్షణలు

రామన్నపేట, బాలసముద్రం, ఎన్జీవోస్ కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పరిశీలన

నిర్మాణాల్లో నాణ్యతా లోపాలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచన

వరంగల్ (ఎన్ టుడే న్యూస్):

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ టి. వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు డివిజన్లలో ఆయన పర్యటించి నిర్మాణంలో ఉన్న, పూర్తయిన రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కమిషనర్ 29వ డివిజన్ రామన్నపేటలోని కమ్యూనిటీ హాల్, 30వ డివిజన్ బాలసముద్రం, 58, 59వ డివిజన్ల పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ, ఇందిరానగర్, ఎక్సైజ్ కాలనీతో పాటు 55వ డివిజన్ భీమారం ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో నిర్మించిన రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్ పనుల పురోగతిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిర్మాణంలో నాణ్యతా లోపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదని స్పష్టం చేశారు. ప్రజాధనంతో చేపడుతున్న పనులు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా తగిన ప్రమాణాలు పాటించాలని సూచించారు.

సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలని, నిర్మాణ సమయంలోనే నాణ్యతను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనులను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సూచించారు.