Tiruvuru: రాజీవ్ భవన్‌లో పటేల్, ఇందిరా గాంధీకి ఘన నివాళులు
తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో భారత మాజీ ఉప ప్రధాని, మాజీ హోంమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు.
దేశ సమైక్యతకు, సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. స్వాతంత్ర్యానంతరం దేశంలోని సంస్థానాల విలీనంలో ఆయన పోషించిన కీలక పాత్రను కొనియాడారు. అదేవిధంగా దేశ అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను పెంపొందించేందుకు ఇందిరా గాంధీ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. దేశం కోసం వారు అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు ప్రకాశరావు, పట్టణ అధ్యక్షుడు జీవన్ బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మీదాస్, ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ నాయకుడు, తిరువూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి నల్లమోలు శ్రీనివాసరావు, సీపీఐ నాయకుడు షేక్ సుభాని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్తగుండ్ల గోపాలకృష్ణ, డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, జీడిమల్ల వెంకటేశ్వరరావు, పర్వతం రామారావు, చిన్నమ్మశెట్టి నాగేశ్వరరావు, గంధం శ్రీనివాసరావు, యద్దనపూడి రాములు, కుంచం దినేష్, కుంచం చంద్రరావు, కే.ఎల్. రావు, గరికపాటి నరసింహారావు, శివ తదితరులు పాల్గొన్నారు.