ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవాలి.. ఆయన ఆశయాల సాధనకు పునరంకితం కావాలి
పెదకూరపాడు, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మహోన్నత త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సందేశం విడుదల చేశారు.