BREAKING
thumb ● Hanmakonda: SIR ప్రక్రియ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం thumb ● ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు thumb ● Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● Hanmakonda: SIR ప్రక్రియ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం thumb ● ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు thumb ● Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 03:33 pm
Posted by : PEDDABOINA SRIKANTH

Hanmakonda: SIR ప్రక్రియ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
01 Nov, 2026 - 03:33 PM
22 వీక్షణలు

హన్మకొండ జిల్లా ఎన్ టుడే న్యూస్ : 

ఓటు హక్కును హరించే S.I.R. ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి – కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: AISF హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్, S.I.R. ప్రక్రియ పేరుతో ఓటర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించడం ఆందోళనకరమని అన్నారు.

S.I.R. ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ AISF హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోకాళ్ళపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉట్కూరి ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (S.I.R.) పేరుతో లక్షలాది మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తెలంగాణలోనే సుమారు 73 లక్షల మంది ఓటర్లను ASDD జాబితాలోకి మార్చినట్లు, మరో 93 లక్షల మందికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్న గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

ఒకే కుటుంబంలో భర్త పేరు ఓటర్ల జాబితాలో ఉండి, భార్య పేరు మాత్రం శాశ్వతంగా నివాసం మారినట్లు తొలగించడం, క్షేత్రస్థాయిలో BLOలు ఇంటింటికీ వెళ్లకుండానే ఓటర్లపై నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అన్నారు.

2002 నాటి ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేదా తల్లిదండ్రుల పేర్లను నిరూపించుకోవాలనే నిబంధనలు పేదలు, నిరక్షరాస్యులు, వలస కార్మికులు, వివాహిత మహిళలు తదితర వర్గాలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్లను గుర్తించి వారి హక్కులను కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ బాధ్యతను విస్మరించకూడదని అన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా, దాని నియామక విధానంలో 2023లో తీసుకొచ్చిన మార్పులు, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజల్లో సందేహాలకు తావిస్తున్నాయని విమర్శించారు.

ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేయాలని, ఓటర్ల తొలగింపునకు దారితీసే విధానాలను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు కేవలం ఎన్నికల్లో పాల్గొనే హక్కు మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి గొంతుక అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా AISF ప్రధానంగా నాలుగు డిమాండ్లను ముందుంచింది:

1. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి.

2. ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తున్న S.I.R. ప్రక్రియను రద్దు చేయాలి.

3. 2023 ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని రద్దు చేసి, ఎన్నికల కమిషన్ స్వతంత్రతను పరిరక్షించాలి.

4. అర్హులైన ఏ ఒక్క ఓటరును కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కాపాడాలి.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత, ప్రజాస్వామిక వాదులు, ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని AISF నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్, కొండ చరణ్, AISF జిల్లా సహాయ కార్యదర్శి చిర్ర సాయి చందు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు N రామ్ చరణ్, సుజిత్, సాత్విక్,శాంతి, దైవస్వరూప్, నందు, బన్నీ,సాయి, తదితరులు పాల్గొన్నారు.

విప్లవ అభినందనలతో

AISF హనుమకొండ జిల్లా సమితి. 

జిల్లా అధ్యక్షులు ఉట్కూరి ప్రణీత్ గౌడ్.