BREAKING
thumb ● Hanmakonda: SIR ప్రక్రియ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం thumb ● ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు thumb ● Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● Hanmakonda: SIR ప్రక్రియ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం thumb ● ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు thumb ● Gujarat : స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన ఇందూర్ జిల్లా వాసులు thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 03:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అభివృద్ధిని కాంక్షించే ఓటర్లు కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Nov, 2026 - 03:27 PM
37 వీక్షణలు

నూజివీడును సుందర నగరంగా తీర్చిదిద్దుతాం మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు, నవంబర్ 1: నూజివీడు పట్టణ అభివృద్ధిని కాంక్షించే ఓటర్లు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. నూజివీడు పట్టణంలోని 18వ వార్డు, రెండో పోలింగ్ కేంద్రంలో మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు భద్రతాపరమైన పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విజ్ఞులైన ఓటర్లు గత ప్రభుత్వ పాలనను, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసుకుని పట్టణ ప్రగతికి ప్రాధాన్యం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్మన్ అభ్యర్థి పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తారని పేర్కొన్నారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, నూజివీడును సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. పట్టణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఓటరు తమ పవిత్రమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి ముత్యాల కామేష్ తదితరులు పాల్గొన్నారు.