BREAKING
thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 10:42 am
Posted by : PEDDABOINA SRIKANTH

గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
31 Oct, 2026 - 10:42 AM
12 వీక్షణలు

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ఎన్ టుడే న్యూస్:

గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తుల అరెస్ట్,
మండల కేంద్రంలోని గ్రామ శివారులో కాకతీయ వెంచర్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. 

20 గ్రాముల గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులను చూసిన ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే పట్టుకొని విచారించారు. విచారణలో వారు అందరూ దామెర గ్రామానికి చెందిన రొడ్డా బోయిన శ్రీదర్,  మట్టెడ జశ్వంత్,  ఉప్పాల గణేష్‌గా గుర్తించారు.

వీరు గత రెండు సంవత్సరాలుగా గంజాయి సేవించడానికి అలవాటు పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో శ్రీదర్ అనే వ్యక్తి హుజురాబాద్ కు వెళ్లి అక్కడ ఆకాష్ అనే వ్యక్తి వద్ద 30 గ్రాముల గంజాయిని రూ.1,500కు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అదే రోజు రాత్రి శ్రీదర్, మట్టెడ జశ్వంత్ కొంత గంజాయిని సేవించారు.

శుక్రవారం మధ్యాహ్నం శ్రీదర్, మట్టెడ జశ్వంత్, గణేష్ ముగ్గురూ కాకతీయ వెంచర్ వైపు వెళ్లి గంజాయి సేవించిన  అనంతరం మిగిలిన గంజాయిని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు,

ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని  వాటిని కొనుగోలు మరియు విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో ఎస్ఐ నరసింహారావు కానిస్టేబుల్ బక్కయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.