BREAKING
thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 10:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసింహారావుపాలెంలో కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Oct, 2026 - 10:43 AM
9 వీక్షణలు

సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి 

ఏలూరు జిల్లా / నూజివీడు నియోజకవర్గం / చాట్రాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. చాట్రాయి మండలం నరసింహారావుపాలెం ఎంపీటీసీ అభ్యర్థి కోట పూజిత, చాట్రాయి మండల జడ్పీటీసీ అభ్యర్థి తెల్లూరి శేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలోని ఓటర్లను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. జడ్పీటీసీ అభ్యర్థి తెల్లూరి శేఖర్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, ఎంపీటీసీ అభ్యర్థి కోట పూజితను ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తున్నారని నాయకులు వివరించారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ప్రజలు తమ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థులకు వేసి విజయాన్ని అందించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు నోబుల్ రెడ్డి, తల్లాడ శ్రీనివాసరావు, పులగం పుల్లారెడ్డి , కట్టా నాగ దుర్గా రావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.