పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం
ELV భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు శిబిరం
- 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
- వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో అర్హులై ఉండాలి.
- పుట్టిన తేద
- డిగ్రీ ఉత్తీర్ణత సంవత్సరం, నెల, తేదీ
- ఆధార్ కార్డు నంబర్
- ఓటరు గుర్తింపు కార్డు నంబర్
- పాస్‌పోర్ట్ సైజు ఫొటో
- డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్
- ఫోన్ నంబర్
- ఈమెయిల్ ఐడీ
- ఇంటి నంబర్‌తో కూడిన పూర్తి చిరునామా
సంస్థాన్ నారాయణపురం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందాలనుకునే అర్హులైన పట్టభద్రుల కోసం ELV భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ నెల అక్టోబర్ 31 (శనివారం), నవంబర్ 1, 5, 6 తేదీల్లో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ప్రత్యేక నమోదు శిబిరం ఏర్పాటు చేయనున్నారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ నిర్వాహకులు కోరుతున్నారు.
అర్హతలు:
కావాల్సిన పత్రాలు, వివరాలు:
ముఖ్య గమనిక: గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకున్నవారు సైతం తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 6 చివరి తేదీ కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.