Tamilnadu: సీఎం విజయ్ కుటుంబంలో విషాదం.. పెద్దమ్మ అమల్ కన్నుమూత
జాతీయం
జాతీయం
మృతదేహానికి నివాళులర్పించిన సీఎం విజయ్, కుటుంబ సభ్యులు
92 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
విజయ్ తండ్రి చంద్రశేఖరన్ సోదరుడు రాజశేఖరన్ భార్య అమల్. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు విదేశాల్లో స్థిరపడటంతో అమల్ వృద్ధాశ్రమంలో ఉంటున్నట్లు సమాచారం.
అమల్ మృతదేహానికి ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, పలువురు మంత్రులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు.