బ్రేకింగ్
తాజా బ్రేకింగ్ వార్తలు ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి...
www.ntodaynews.com

ఇసుక వాహనాలు ఏపి సరిహద్దు దాటుతున్న కొరవడుతున్న నిఘా

తెలంగాణ
RTI Sattish NToday Special
07 Sep, 2025
188 వీక్షణలు
ఇసుక వాహనాలు ఏపి సరిహద్దు దాటుతున్న కొరవడుతున్న నిఘా .... NTYODAY NEWS: జగ్గయ్యపేట తెలంగాణాలో పట్టుబడుతున్న ఇసుక వాహనాలు ఏపి సరిహద్దు మండలంలో దొడ్డిదారిన తెలంగాణాకి తరలి వెళ్ళుతున్న ఇసుక ఇసుక అక్రమార్కులకు చెక్ పెడుతున్న తెలంగాణ పోలీసులు తెలంగాణ పోలీసులు విచారణలో త్రవ్వుతున్న కొద్ది జగ్గయ్యపేట వారే ఎక్కువేనంటున్న వాదనలు.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు ఉచిత ఇసుక పథకం ప్రజలకు అందుతుంది. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో కొందరికి మాత్రం ఇసుక అక్రమ రవాణాతో కాసుల వర్షం కురిస్తుందని ప్రజల నుండి బహిరంగ చర్చలు వినిస్తున్నాయి.ఎందుకంటే జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో కృష్ణా, మున్నేరు, పాలేరు నదుల వెంబడి మూడు మండలాలలో సహజ సిద్ధంగా రేవులలో ఇసుక లభ్యమౌతుంది. జగ్గయ్యపేట మండలానికి సరిహద్దుగా తెలంగాణ రాష్ట్రంలో చింతలపాలెం,హుజుర్ నగర్,కోదాడ, దొండపాడు, మేళచెరువు,నేలకొండపల్లి మండలాలు,వత్సవాయి,పెనుగంచిప్రోలు మండలాలకి తెలంగాణ సరిహద్దుగా బోనకల్లు, మదిర తదితర మండలాలు నియోజకవర్గ ప్రాంతానికి శివారు గా ఉన్నాయి. తెలంగాణాకి చేరుకోవాలంటే జగ్గయ్యపేట నియోజకవర్గ సరుహద్దు గా సుమారు 15 నుండి 20 లోపు వివిధ రకాలుగా రహదారులున్నాయి.తెలంగాణకి ఇసుక అక్రమంగా తరలించే వాహనాల పై జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో కొన్ని సందర్భాలల్లో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాని పోలీసుల కళ్లు కప్పి ఇసుక అక్రమార్కులు జగ్గయ్యపేట ప్రాంతం నుండి తెలంగాణాకి దొడ్డిదారిన ఇసుకని అక్రమంగా తరలించడానికి తెరలేపుతున్నారు. ఈ అక్రమ దందా వెనుక జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రధానంగా సుమారు పది మంది పైబడి పేర్లు బహిరంగంగా ప్రజల నాలుకలో నానుతూ వినిపిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల మండలాలలో ఇప్పటికే వీరిలో కొంతమందిపై ఇసుక అక్రమ తరలింపు పై విపరీతమైన కేసులు నమోదు అవుతున్నట్లు తెలంగాణ ప్రజల నుండి సమాచారం తెలుస్తుంది.దీనికి ఉదాహరణగా ది : 03 /09/25 న హుజుర్ నగర్ పోలీస్ లకు పట్టుబడిన వాహనం, దానిని రెండు రోజుల పాటు జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో గల ఇసుక అక్రమార్కులు ఎవ్వరెవ్వరని గుర్తించి వారిని విచారించగా, వీరిలో దొడ్డిదారిన అక్రమార్జన కోసం కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ముద్రణలు,స్టాంపులు వెలుగు చూసినట్లు హుజుర్ నగర్ పోలీస్ లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం జరిగింది.ఇంకా ఈ అక్రమ ఇసుక రవాణా వెనుకాల మరియు నకిలీ పత్రాలు,నకిలీ స్టాంపుల వ్యవహారంలో జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో ఇంకొందరు ఉన్నట్లు పూర్తి విచారణ అనంతరం హుజుర్ నగర్ పోలీసులు వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.ఇంత జరుగుతున్న ఏపిలో జగ్గయ్యపేట నియోజకవర్గ పోలీసు యంత్రాంగం నిఘాని పట్టిష్టం చేయకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజల నుండి వినికిడి.ఇప్పటికైన జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి అక్రమంగా ఇసుక తరలింపు పై పోలీస్ లు ఉక్కుపాదం మోపి,ఇసుక అవసరమైన జగ్గయ్యపేట ప్రజలందరికి ఉచితంగా పూర్తి స్థాయిలో అందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube