నూతన ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేతలు
NTODAY NEWS: ఆమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు
సత్యసాయి జిల్లా, ఆమడగూరు, స్థానిక పోలీస్ స్టేషన్ కు బదిలీపై విచ్చేసిన నూతన ఎస్సై గోపాల్ కృష్ణ ను టిడిపి నేతలు మంగళవారం పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్సై గోపాల్ కృష్ణను పూలమాలలు దుశాలవాలతో సన్మానించారు.ఈ సందర్బంగా మండల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.అలాగే మండలంలో వ్యవసాయ బోరుబావుల వద్ద విద్యుత్ ట్రాన్సపార్మర్ లు దొంగతనాలు చేస్తున్నారని ఎస్సై దృష్టికి తీసుకోచ్చారు.అదేవిధంగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.యువత మద్యం సేవిస్తున్నారని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్ఐని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ షబ్బీర్ బాషా, టిడిపి నాయకులు కుమార్ రెడ్డి,రాజారెడ్డి,వడ్డెర సంఘం అధ్యక్షులు దొనకొండ రమణప్ప,మంజుల లక్ష్మన్న,రమణ,కిష్టప్ప,టైలర్ రామాంజులు,నరసింహమూర్తి, మారుతీ,శంకర,హనుమంతు రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube














