BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 06 March 2026, 07:38 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

నంద్యాలలో ఘనంగా ఇఫ్తార్ విందు

తెలంగాణ
06 Mar, 2026 - 07:38 PM
620 వీక్షణలు
నంద్యాలలో ఘనంగా ఇఫ్తార్ విందును ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని పలు మసీదుల్లో ‘దావత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నశ్యం మహమ్మద్ ఫరూక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంజాన్ మాసం నాలుగో రోజు సందర్భంగా నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో ఎన్ఎండి ఫయాజ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఇఫ్తార్ విందును ప్రారంభించారు. మసీద్-ఏ-బాబా ఫకృద్దీన్ (ఎన్‌జీవో కాలనీ), ఆటోనగర్ మసీదు, పొన్నపురం, విశ్వనగర్, ఆటోనగర్ మరియు రైల్వే స్టేషన్ సమీపంలోని మసీదుల్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దైవచింతనకు నిదర్శనమని తెలిపారు. రోజంతా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ సమయంలో భోజనం అందించడం అల్లాహ్ దృష్టిలో అత్యంత పుణ్యకార్యమని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి నశ్యం మహమ్మద్ ఫరూక్ ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరూ ఐకమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని, వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విందులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలో మత సామరస్యం వెల్లివిరియాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అల్లాహ్ కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, మసీదు కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. #Nandyal #Ramadan #Iftar #NMDFayaz #NMDFarooq #TDP #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube