BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 13 June 2026, 10:36 am
Posted by : రావిపాటి ప్రభాకరావు

డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
13 Jun, 2026 - 10:36 AM
140 వీక్షణలు

పల్నాడు జిల్లాలో డ్వాక్రా గ్రూపు నిధుల దుర్వినియోగం కేసులో రొంపిచర్ల DRDA APM సోమశేఖర్, సీసీ సుబ్బారావుకు పొన్నూరు కోర్టు రిమాండ్ విధించింది.

గతంలో కాకుమాను మండలంలో APMగా పనిచేసిన సోమశేఖర్, సీసీ సుబ్బారావుపై గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ అవకతవకల్లో యానిమేటర్‌తో పాటు ఇద్దరు గ్రూపు లీడర్ల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సోమశేఖర్, సుబ్బారావు, యానిమేటర్, ఇద్దరు గ్రూపు లీడర్లపై కాకుమాను పోలీసులు కేసు నమోదు చేశారు. సోమశేఖర్‌పై నాన్-బెయిలబుల్ కేసు నమోదు కాగా, కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో పొన్నూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

వారెంట్ అమలు చేసిన కాకుమాను పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి పొన్నూరు జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఇద్దరికీ రిమాండ్ విధించింది. అనంతరం వారిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

ప్రస్తుతం సోమశేఖర్ పల్నాడు జిల్లా రొంపిచర్లలో DRDA APMగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.