BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 09:10 pm
Posted by : SHAIK CHAND BASHA

పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
27 Aug, 2026 - 09:10 PM
65 వీక్షణలు

వైకాపా పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు

పులివెందుల అర్బన్:

శానిటేషన్,విభిన్న ప్రతిభావంత మహిళలకు చీరల పంపిణీ

కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ మనోహర్ రెడ్డి,వైఎస్ దుష్యంత్ రెడ్డి హాజరయ్యారు.పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్ ముఖ్య అతిథులతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,ప్రజలకు నిరంతరం సేవలందించాలని వారు ఆకాంక్షించారు.

జన్మదిన వేడుకల సందర్భంగా పార్నపల్లి కిషోర్ ప్రత్యేకంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న శానిటేషన్ (పారిశుద్ధ్య) మహిళా కార్మికులకు,విభిన్న ప్రతిభావంత మహిళలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నూతన చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పార్నపల్లి కిషోర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్‌తో పాటు వైకాపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు,మహిళా నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.